English | Telugu

వచ్చే ఏడాది 6 సినిమాలతో సందడి చేయబోతున్న దిల్‌రాజు!

తెలుగులో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన నిర్మాత దిల్‌రాజు.. ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌ బాలీవుడ్‌ స్టార్స్‌తో హిందీలో వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు దిల్‌రాజు. వచ్చే ఏడాది తమ సంస్థ ద్వారా ఆరు హిందీ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతి సూపర్‌హిట్‌ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని అక్షరుకుమార్‌, అనీస్‌ బాజ్మీ కాంబినేషన్‌లో హిందీ రీమేక్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. రిలీజ్‌ని కూడా వచ్చే ఏడాదే ప్లాన్‌ చేశారు.

సల్మాన్‌ ఖాన్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ హిందీ సినిమాను ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో విజరు దేవరకొండ, కీర్తి సురేశ్‌ జంటగా నిర్మిస్తున్న 'రౌడీ జనార్ధన' చిత్రం కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఇవిగాక మరో మూడు సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు సినిమాలను కూడా వచ్చే ఏడాదే రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు.