English | Telugu
మోదీ, దేవిశ్రీప్రసాద్ లు గ్లోబల్ ఐకాన్స్
Updated : Sep 25, 2024
సుదీర్ఘ కాలంనుంచి తన సంగీతంతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తు వస్తున్నసంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్(devi sri prasad)కూడా ఒకడు. 1999 లో వచ్చిన దేవి మూవీతో మొదలుకొని ఎన్నో హిట్ సినిమాలకి అద్భుతమైన బాణీలని అందిస్తూ వస్తున్నాడు.దేవి ఇచ్చిన మ్యూజిక్ వల్ల కూడా సినిమాలు హిట్టయిన సందర్భాలు కూడా ఉన్నాయంటే దేవి మ్యాజిక్ ని అర్ధం చేసుకోవచ్చు దేశ విదేశాల్లో కూడా పలురకాల ఈవెంట్స్ కి వెళ్తూ తన దైన యాటిట్యూడ్ తో అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు.
రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(narendra modi)న్యూయార్క్ లో పర్యటించారు. మోదీ అండ్ యూఎస్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఆ ఈవెంట్ లో మన దేశ భక్తిని చాటుతూ తెరకెక్కిన హర్ ఘర్ తిరంగా అనే సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా దేవిని మోడీ ఆప్యాయంగా హత్తుకోవడమే కాకుండా భుజం తట్టి ప్రోత్సహించాడు.ఈ సందర్భంగా మోడీ తో కలిసి దేవి ఒక సెల్ఫీ కూడా దిగాడు. ఇప్పుడు ఆ సెల్ఫీని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారంటూ ట్వీట్ చేసింది.
దేవి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లోనే తండేల్ ని చేస్తున్నాడు.అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)సాయి పల్లవి(sai pallavi)జంటగా వస్తున్న ఆ మూవీపై దేవి రాకతో మ్యూజిక్ పరంగా కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి సంబంధించిన ఆర్ఆర్ ఒక రేంజ్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో సాంగ్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. దేవి సంగీతంలోనే రాబోతున్న సూర్య(surya)ప్రెస్టేజియస్ట్ మూవీ కంగువా(kanguva)మీద కూడా అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.