English | Telugu

ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. డివైడ్ టాక్ తోనూ దేవర ఊచకోత!

తన స్టార్ పవర్ తో భారీ కలెక్షన్లు రాబట్టగల అతి కొద్దిమంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ఒకరు. తన తాజా చిత్రం 'దేవర' (Devara)తో ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ పాన్ ఇండియా మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. (Devara Collections)

రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర.. కేవలం ఆరు రోజుల్లోనే రూ.190 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. నేటి నుంచి దసరా సెలవులు కావడంతో మరో పది రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర దేవర దూకుడు కొనసాగే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.250 కోట్ల షేర్ దాకా రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే.