English | Telugu

మీరు సిద్ధమంటే నేను సిద్ధమే.. ఎన్టీఆర్ పోస్టర్ వైరల్

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నటనకి ఉన్నశక్తిని మరోమారు చాటి చెప్పిన చిత్రం 'దేవర'(Devara).గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యింది. దేవర, వర గా రెండు విభిన్నమైన క్యారక్టర్ లలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు,ప్రేక్షకులు దేవర కి జేజేలు పలికారు. భయస్థుడైన వర, చనిపోయిన తన తండ్రి దేవర ఉన్నాడని నమ్మించి,శత్రువులలో భయాన్ని అలాగే ఉంచుతాడు. పైగా దేవర గుండెల్లో కత్తి ఉన్నప్పుడు,వర నే ఆ కత్తి దించినట్టుగా చూపించారు. అసలు దేవర బాడీ కూడా దొరకదు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 లో కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది.

కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పార్ట్ 2 ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపించాయి. అలాంటి రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతు 'దేవర' విడుదలై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ వేదికగా పార్ట్ 2 కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తు 'దేవర సముద్ర తీరాన్ని వణికించి నేటికీ ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పుడు గుర్తు పెట్టుకునే పేరు ఇది. తాను పంచిన ప్రేమ, చూపిన భయం ఎప్పటికి మర్చిపోలేరు. దేవర 2 (Devara 2)కోసం సిద్ధంగా ఉండడంటూ పోస్ట్ చేసింది. .

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్(Trivikram)డైరెక్షన్ లో మూవీ ఉంది. ఈ చిత్రం పురాణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ప్రారంభం కావడానికి కొంచం టైం పట్టే అవకాశం ఉంది. పైగా త్రివిక్రమ్ కూడా ఇప్పుడు వెంకటేష్ తో మూవీ చేస్తున్నాడు. దీంతో ప్రశాంత్ నీల్ మూవీ కంప్లీట్ అయ్యాక, దేవర 2 లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. ఏది ఏమైనా దేవర 2 కి సిద్ధంగా ఉండడంటూ చేసిన పోస్టర్ అభిమానుల్లో జోష్ ని తీసుకొచ్చింది. పార్ట్ 1 లో చూసింది తక్కువ, పార్ట్ 2 లో దేవర విశ్వరూపం చూస్తారని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)పలు ఇంటర్వ్యూ లలో చెప్పుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. దేవర వరల్డ్ వైడ్ గా 400 కోట్లరూపాయిల దాకా వసూలు చేసింది.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.