English | Telugu

తెలుగులోనూ నటించాలని వుంది

‘ఫైండింగ్ ఫన్నీ’ మూవీ ప్రచారం కోసం హైదరాబాద్ కొచ్చిన దీపికాపదుకునె తన మనసులో మాటను బయటపెట్టింది.తెలుగు సినిమాలలో నటించాలని నేను గతంలో ఎంతో ఎదురుచూశాను. అయితే అప్పుడు నాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు నాకు తెలుగు సినిమాల్లో నటించాల్సిందిగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సమయం చిక్కడం లేదు’’ అని దీపిక ఈ సందర్భంగా చెప్పింది. టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో మహేష్‌బాబు అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అర్జున్ కపూర్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్‌గా హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందిన ‘ఫైండింగ్ ఫన్నీ’ ఈనెల 12న విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.