English | Telugu

ఆరోజు ఉదయం నిద్ర లేవకపోతే నేను ఇకలేను అనుకోండి అని చెప్పాను

తెలుగు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ ఒరవడి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నృత్య తారలు తమ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. గతంలో జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్మ్‌స్మిత, డిస్కోశాంతి, అనూరాధ వంటి వారు ఐటమ్‌ గర్ల్స్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. 2000 తర్వాత ఐటమ్‌ సాంగ్స్‌కి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన డాన్సర్‌ ముమైత్‌ఖాన్‌. ‘పోకిరి’ చిత్రంలోని ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అనే ఒక్క పాటతో స్టార్‌ డాన్సర్‌ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో తన డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాంటి డాన్సింగ్‌ స్టార్‌ సడన్‌గా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. కొన్ని సంవత్సరాల పాటు ఏ సినిమాలోనూ, ఏ షోలోనూ కనిపించలేదు. ఆ సమయంలోనే స్పెషల్‌ సాంగ్‌ పేరుతో స్టార్‌ హీరోయిన్స్‌తోనే ఐటమ్‌ సాంగ్స్‌ చేయించడం మొదలు పెట్టారు దర్శకనిర్మాతలు. ఐటమ్‌గర్ల్‌గా అంతటి స్టార్‌డమ్‌ని తెచ్చుకున్న ముమైత్‌ఖాన్‌ ఒక్కసారిగా తెరమరుగైపోవడానికి కారణం ఏమిటనేది కొందరికి మాత్రమే తెలుసు. ఇటీవల ఓ షోలో తను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను ప్రపంచానికి తెలియజేశారు. ఆ షోలో ముమైత్‌ఖాన్‌ ఏం మాట్లాడారు అనేది తెలుసుకుందాం.

‘నేను సడన్‌గా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నాకు అలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. బ్రెయిన్‌ అనురిజం అనే వ్యాధి కారణంగా వచ్చిన సమస్యల వల్ల నా బ్రెయిన్‌లో 9 వైర్లు అమర్చారు. 7 సంవత్సరాలపాటు ఎలాంటి డాన్స్‌ షోలు చెయ్యవద్దని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్‌ అయిన మూడు నెలల తర్వాత నా విల్‌ పవర్‌ ఎంత వుంది అనేది చెక్‌ చేసుకోవడానికి ఒక గేమ్‌ షోకి వచ్చాను. అదే టైమ్‌లో బ్యాంకాక్‌లో ఒక స్టంట్‌ షోకి కూడా వెళ్లాను. రోజంతా ఆ షో చేశాను. మరుసటి రోజు ఉదయం లేవలేకపోయాను. రేపు ఉదయం నిద్ర లేవకపోతే నేను ఇకలేను అనుకోండి అని అంతకుముందు రోజే స్వప్నదత్‌కి చెప్పాను. కానీ, తర్వాత నన్ను నేను సర్ది చెప్పుకున్నాను. డాక్టర్లు చెప్పినట్టుగా 7 సంవత్సరాలు ఎలాంటి వర్క్‌ చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యాను. కొన్ని మెడిసన్స్‌ వాడడం వల్ల ఫ్యాట్‌ అయిపోతాం. నాకూ అలాగే జరిగింది. డాన్సర్స్‌ లావు అయిపోతే అస్సలు బాగుండదు. కానీ, నేను ఎంతో పట్టుదలతో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. అంతకుముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యాను. ఇప్పుడు బయటికి వచ్చాను. కొన్నిసార్లు మెడిసన్స్‌ కంటే దైవబలం మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నా విషయంలో అదే జరిగింది అనుకుంటున్నాను. అందుకే ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కోవాలి తప్ప బాధపడడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం వల్ల ఏమీ జరగదు’ అంటూ ఇండస్ట్రీ నుంచి కొన్ని సంవత్సరాలపాటు దూరంగా ఉండడానికి గల కారణాలను వివరించారు ముమైత్‌ఖాన్‌.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం