English | Telugu

నాగ్ డమరుకం స్కెడ్యూల్ జూలై తొలివారం నుండి

నాగ్ "డమరుకం" స్కెడ్యూల్ జూలై తొలివారం నుండి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై, యువ సామ్రాట్, అక్కినేని నాగార్జున హీరోగా, అందాల అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా "డమరుకం". ఈ సినిమా తదుపరి స్కెడ్యూల్ జూలై తొలి వారం నుండి ప్రారంభం కానుంది. "డమరుకం" నాగార్జున సినీ జీవితంలోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రమని తెలిసింది. "డమరుకం" చిత్రానికి 50 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు కానుందట. ఈ "డమరుకం" చిత్రంలో సుమారు 55 నిమిషాల సేపు గ్రాఫిక్స్ ఉన్నాయట.

ఈ "డమరుకం" సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూండగా, చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. జూన్ 6 వ తేదీన, బి.హెచ్.ఇ.యల్.సమీపాన కల శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివారి ఆలయంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. నాగార్జున "డమరుకం" చిత్రంలో నాగార్జున ఆటోడ్రైవర్‍ గా నటిస్తూండగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శివుడిగా నటిస్తున్నారు. అనుష్క అద్భుత శక్తులు కల అమ్మాయిగా నటిస్తూండగా, మరో ముఖ్య పాత్రలో అభిమన్యు సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే "డమరుకం" సినిమాలోని ఒక పాటను హీరో నాగార్జున, హీరోయిన్ అనుష్కల మీద స్విట్జర్ల్యాండ్ లో చిత్రీకరించారు. 2012 సంక్రాంతి పండుగకు ఈ "డమరుకం" విడుదల కానుంది. అదే సమయంలో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చే "ది బిజినెస్ మ్యాన్" సినిమా కూడా రిలీజవుతుందని వినికిడి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.