English | Telugu

Akhanda 2: రిలీజ్ కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

-ఇక బాలయ్య జాతర స్టార్ట్
-కోర్టు గ్రీన్ సిగ్నల్
-కాసేపట్లో నిర్మాతల మీడియా సమావేశం

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)అభిమానులకి, మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. అఖండ 2 కి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. డిసెంబర్ 5 న విడుదల కాకుండా అఖండ 2 పై స్టే ఇచ్చిన చెన్నై హైకోర్టు రీసెంట్ గా అఖండ 2 కి సంబంధించిన తీర్పుని వెల్లడి చేసింది.

కేసుని పరిశీలించిన పిదప అఖండ 2 పై ఉన్న కేసు కొట్టివేస్తూ రిలీజ్ కి అనుమతి ఇస్తు తన తీర్పుని వెల్లడి చేసింది. దీంతో అడ్డంకులు తొలిగిపోవడంతో నిర్మాతలు కాసేపట్లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ నెల 12 న విడుదల కాబోతునట్టుగా టాక్. మరి 11 నుంచే ప్రీమియర్ షోస్ తో అభిమానుల జాగరణ ప్రారంభం కావడం ఖాయం.



బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం