English | Telugu

పూరీ 'బుద్ధ'లో నేహ బదులు ఛార్మి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో నిర్మించబడే "బుద్ధ" చిత్రంలో ముందుగా "చిరుత" ఫేం నేహాశర్మ నటిస్తుందని వినపడింది. ఇప్పుడి నేహా శర్మ స్థానంలో ఛార్మిని తీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ విషయమై నేహాశర్మని అడిగిన విలేఖరులకు "అబ్బెబ్బె పూరీ నన్నేం తీయలేదండీ. నాకే డేట్లు కుదరక ఆ "బుడ్డా"లో చేయనని చెప్పాను" అని అంది.

ఏది ఏమైనా పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించే "బుద్ధ" చిత్రంలో నటించే అవకాశం ఛార్మికి దక్కింది. పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని రానున్న ఏప్రెల్ నెలలో ప్రారంభించనున్నాడు. ఈ లోగా రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ లతో కల్సి పూరీ జగన్నాథ్ "పెళ్ళి" చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని పోయిన సంవత్సరమే మొదలెట్టాల్సింది.అమితాబ్ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల ఈ యేడాదికి వాయిదా పడింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.