English | Telugu
పుష్ప 2 పై పోలీసు కేసు
Updated : Nov 29, 2024
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)ప్రస్తుతం పుష్ప పార్ట్ 2(pushpa 2)కి సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5 డేట్ దగ్గర పడుతుండతంతో క్షణం తీరిక కూడా లేకుండా
పాట్నా లో జరిగిన ఈవెంట్ దగ్గరనుంచి వరుసగా చెన్నై,కేరళ,ముంబై వేదికగా జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తున్నాడు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులని ఉద్దేశిస్తూ నాకు అల్లు అర్జున్ ఆర్మీ అని సంబోధించడం జరుగుతుంది.ఇప్పుడు ఈ విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ జవహర్ నగర్ పి ఎస్ లో గ్రీన్ పీస్ సంస్థ అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి ఆర్మీ అని పెట్టుకోవడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోరుతున్నారు. ఒక వేళ అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరు తొలగించి క్షమాపణ చెప్తే కంప్లంట్ ని వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ చెప్తుంది.