English | Telugu
రామ్ చరణ్ క్రికెట్ ఆడతాడా! దేవర సినిమాటోగ్రాఫర్ ఆసక్తి కర ట్వీట్
Updated : Feb 8, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం తన 16 వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్'(Game Changer)పెద్దగా ప్రేక్షకాదరణ పొందని నేపథ్యంలో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.ఇక ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది.'దేవర'(Devara)ఫేమ్ జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా,బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుందనే వార్తలు,మూవీ ప్రారంభమైనప్పట్నుంచి వస్తూనే ఉన్నాయి.ఇందుకు సంబంధించి రక రకాల క్రీడల పేర్లు కూడా బయటకి వచ్చాయి.చిత్ర బృందం మాత్రం ఇంతవరకు పలనా కథ అంటూ ఎక్కడ అధికారంగా వెల్లడి చెయ్యలేదు.కానీ ఇపుడు ఈ మూవీకి ఫొటోగ్రఫీ ని అందిస్తున్న లెజండరీ ఫోటోగ్రాఫర్ రత్నవేలు(Rathnavelu)ఎక్స్ వేదికగా 'రాత్రిళ్ళు షూటింగ్,ఫ్లడ్ లైట్లు,పవర్ క్రికెట్,విచిత్ర కోణాలు అంటూ ట్వీట్ చెయ్యడం జరిగింది.దీంతో ఆర్ సి 16 క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోందని,రెండు గ్రామాల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ ఉండబోతుందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఆర్ సి 16 కి రత్నవేలు వర్క్ చేస్తున్నప్పట్నుంచే మూవీకి సంబంధించిన కొన్ని కీలక విషయాల్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం నెగెటివ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలతో కొంత పార్ట్ షూటింగ్ చేస్తున్నామని,ఆ సీన్లు ఎంతో బాగా వచ్చాయి.సహజత్వానికి దగ్గరగా కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు.ఇలా ఇప్పుడు క్రికెట్ గురించి కూడా చెప్పి మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చాడు.రత్నవేలు లేటెస్ట్ గా 'దేవర'తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక ఆర్ సి 16 ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్(Sukumar)రైటింగ్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.