English | Telugu

అభిమానుల వెర్రి

అభిమానుల వెర్రి చూస్తే జాలేస్తుంది. అభిమానానికి వెర్రికి ఈ రోజుల్లో పెద్దగా తేడా లేకుండా పోతుంది.మహేష్ బాబు, రామ్ చరణ్ అభిమానులు మళ్ళీ రికార్డుల గురించి గొడవ పడుతున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ, కొణిదల చిరంజీవిల మధ్య రాజకీయపరమైన మాటల యుద్ధం ప్రారంభమయ్యింది. రాజకీయనాయకులన్న తర్వాత అది అత్యంత సహజం. అయితే వీళ్ళిద్దరూ తెలుగు తెర హీరోలు కావటం, అదీ రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులు కావటంతో, వారి అభిమానులు ఈ మాటల యుద్ధాన్ని తమ మధ్య యుద్ధంగా పరిగణించటం బాధాకరం. ఈ ఇద్దరు హీరోల అభిమానులకూ ఒక విషయం ఇక్కడ గుర్తుచేయాలి.

చిరంజీవి కూతురు పెళ్ళిలో బాలకృష్న డ్యాన్స్ చేస్తే, బాలకృష్ణ కూతురి పెళ్ళిలో చిరంజీవి డ్యాన్స్ చేశారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే విషయాన్ని వీళ్ళిద్దరి అభిమానులూ మరచిపోతున్నారు. రాజకీయపరమైన అభిప్రాయభేదాలూ, విభేదాలే తప్ప, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన భేదాలు లేవనే సంగతి కూడా ఇక్కడ అభిమానులు గుర్తుంచుకుంటే బాగుంటుంది. అలాగే మహేష్ బాబు, రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరోలు మంచి సినిమాల్లో నటించాలని కోరుకోవాలే కానీ, రికార్డుల కోసం గొడవపడటం సమయం వృధా చేసుకోవటమే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.