English | Telugu
"బిజినెస్ మ్యాన్" వంద కోట్లట
Updated : Jan 9, 2012
"బిజినెస్ మ్యాన్" వంద కోట్లట. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదల కానుంది. తమన్ ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే సూపర్ హిట్టయ్యింది.
ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం తెలుగు, తమిళ, మళయాళ భషల్లో విడుదల కానుంది. కాకపోతే తెలుగులో విడుదలైన పదిహేను రోజులకు మిగిలిన రెండు భాషల్లో విడుదల చేస్తారట. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం బిజినెస్ పరంగా మూడు భాషల్లో మొత్తం కలిపి వంద కోట్లు వసూలుచేస్తుందని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులంటుంటే, ఈ విషయంపై స్పందిస్తూ మెగా ఫ్యాన్స్ "ఈ సినిమాకి అంత సీన్ లేదని" అంటున్నారు. ఎవరికి ఎంత సీనుందో జనవరి 13 వ తేదీన తేలుతుంది.