English | Telugu

ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" 11 న కాదు 13 న

ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్" 11 న కాదు 13 న అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న విభిన్నకథా వినోదాత్మక చిత్రం "బిజినెస్ మ్యాన్". ఇటీవలే సంచలనాత్మకంగా తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో తెలుగు, తమిళ, మళయాళభాషల్లో ఒకేసారి విడుదలైంది. అంటే ఆ మూడుభాషల్లో ఈ"బిజినెస్ మ్యాన్" చిత్రం ఒకేసారి విడుదల కానుంది.

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం నిజానికి జనవరి 11 వ తేదీన విడుదలవుతుందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ చిత్రం యొక్క నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటం వల్ల ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలలో కాస్త ఆలస్యం చోటుచేసుకుంది. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ముందుగా అనుకున్నట్టు జనవరి 11 వ తేదీన కాకుండా జనవరి 13 వ తేదీన విడుదల కాబోతూంది. విక్టరీ వెంకటేష్ జనవరి 14 వ తేదీన విడుదల కాబోతూంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.