Read more!

English | Telugu

బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందట...!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ డ్రామా బ్రహ్మోత్సవంపైనే ఇప్పుడు మహేష్ అభిమానుల చూపులన్నీ ఉన్నాయి. సినిమా అప్ డేట్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. రేపు సాయంత్రమే ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో చేసుకోబోతోంది మూవీ టీం. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండటం, సీతమ్మ వాకిట్లో సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తుండటంతో బ్రహ్మోత్సవం పై భారీ అంచనాలే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా, రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ నడుస్తోంది. కనీసం సినిమాకు సంబంధించిన వాళ్లు కూడా నోరు మెదపకపోవడంతో, మూవీ టీం మధ్య సయోధ్య ఉండట్లేదని, రిలీజ్ డిలే అవ్వచ్చని రకరకాల వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం, మే 20 న మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయబోతున్నారట. రేపు జరిగే ఆడియో ఫంక్షన్లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. పివిపీ బ్యానర్లో, శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు.