Read more!

English | Telugu

బ్రహ్మోత్సవం సినిమా సమస్య ఏంటి..?

బ్రహ్మోత్సవం టీం మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయా..? సినిమా యూనిట్ లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా..? తాజాగా వస్తున్న వార్తల బట్టి ఈ డౌట్స్ రాక మానవు. ఆడియో రిలీజ్ ఏప్రిల్ 24న తిరుపతిలో చేద్దామనుకుని ఆ తర్వాత మే 6వ తేదీకి మార్చేశారు. తాజాగా మరో రోజు వాయిదా వేసి మే 7 న పాటల వేడుక నిర్వహించాలనుకుంటున్నారు మూవీ టీం. మొదట తిరుపతి అనుకున్న ఆడియో వెన్యూ ఇప్పుడు శిల్పకళావేదికకు మారిపోయింది. మరోపక్క సినిమా గురించి కూడా ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ స్లో అయిపోయిందని, మహేష్ కు శ్రీకాంత్ అడ్డాల ప్లానింగ్ నచ్చలేదని, ఇలా చాలా పుకార్లు వినబడ్డాయి. వీటిలో ఎంత వరకూ నిజముందో పక్కన పెడితే, ఆడియో రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందనేది మాత్రం కన్ఫామ్. వీటి వెనుక కారణాలు తెలియకపోయినా, మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ ఆడియో డేట్స్ ఛేంజింగ్ చాలా అసహనం కలిగిస్తున్న మాట వాస్తవం. సినిమాను మే 20 న రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మూవీ టీం. కాజల్, సమంత, ప్రణీత లు హీరోయిన్లుగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు.