Read more!

English | Telugu

ప్రత్యూష బెనర్జీ రాహుల్ తో మాట్లాడిన మాటలు ఇవే..!

సూసైడ్ చేసుకున్న బాలికా వధు నటి ప్రత్యూష బెనర్జీ, తన ప్రియుడు రాహుల్ తో జరిపిన చివరి ఫోన్ కాల్ హిస్టరీ ఆడియోను కోర్టుకు సమర్పించారు పోలీసులు. దాదాపు మూడున్నర నిముషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో ప్రత్యూష రాహుల్ ల మధ్య ఉన్న విభేదాలు తేటతెల్లమయ్యాయి. ఆత్మహత్యకు ఒక గంట ముందు ప్రత్యూష రాహుల్ తో మాట్లాడింది.

ప్రత్యూష: నన్ను క్యారెక్టర్ లేనిదానిలా ముద్రవేశారు. చంపుతామని బెదిరిస్తూ నాకు, మా అమ్మానాన్నలకు కాల్స్ వస్తున్నాయి. నాకు జీవితంలో ఇంకేం మిగిలిందిప్పుడు?

రాహుల్ : ఇవేమి పెద్ద విషయాలు కాదు

ప్రత్యూష : రాహుల్, దయచేసి నీ ఈగోను పక్కనపెట్టు. ఇవేమి పెద్ద విషయాలు కాదని ఎలా చెబుతావు
ప్రత్యూష ఇంకా ఏదో మాట్లాడుతుండగా రాహుల్ ఫోన్ కట్ చేశాడు.

మరో కాల్ కలిసిన తర్వాత..

ప్రత్యూష : నవ్వు మోసగాడివి. నన్ను వంచించావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో.

రాహుల్ : ఏమైంది. నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే వరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకు.

ఇదీ సూసైడ్ కు ముందు ప్రత్యూష, రాహుల్ మధ్య జరిగిన సంభాషణ. ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ మాటల్లో ప్రత్యూష పట్ల నిర్లక్ష్యం ఉండటం ఇక్కడ గమనార్హం.