English | Telugu
తెలుగు సినిమా ఆన్ లైన్ టికెట్స్ బ్యాన్
Updated : May 17, 2011
తెలుగు సినిమా ఆన్ లైన్ టికెట్స్ బ్యాన్ చేయబడ్డాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉండే వారికి అనుకూలంగా ఉండే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవటానికి అనుమతినిచ్చింది. అందుకు గాను సర్వీస్ టాక్స్ ఆరు రూపాయలుగా విధిస్తూ జి.వో.జారీ చేసింది.
కానీ ఆన్ లైన్ టికెట్స్ అమ్మే వారు వాళ్ళిష్టం వచ్చినట్లు సర్వీస్ టాక్స్ పేరు మీద వసూలు చేయటం గమనించిన ప్రభుత్వం, ఆన్ లైన్ టికెట్స్ ని బ్యాన్ చేస్తూ మరో జి.వొ.ని జారీచేయగా, కోర్టు దానికి సమ్మతిస్తూ లేటెస్ట్ గా ఆర్డర్స్ జారీ చేసింది. దీని వలన ఆన్ లైన్ టికెట్స్ అమ్మే "బుక్ మై టికెట్స్, టికెట్ దాదా, నో మోర్ క్యూ క్యూ, టికెట్ నౌ, టికెట్ ప్లీజ్, క్యా జుంగా" లతో పాటు మరో అయిదు మల్టీప్లెక్స్ అధికారిక వెబ్ సైట్లను కూడా ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేసింది.దీని వలన ఆన్ లైన్లో తెలుగు సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునేవారికి ఇబ్బందే మరి...!