Read more!

English | Telugu

ఇలియానా బాలయ్యను వద్దంటోంది...!

బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్..ఈ నలుగురు టాలీవుడ్ పిల్లర్స్ గా చాలాకాలం టాప్ స్టార్స్ గా కొనసాగారు. వీళ్లతో నటిస్తే స్టార్ డమ్ వచ్చేస్తుందని ఆశపడేవారు హీరోయిన్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కుర్రహీరోల బ్యాచ్ వచ్చేసింది. పెద్ద హీరోలతో సినిమా చేయడానికి హీరోయిన్స్ జంకుతున్నారు. దీంతో నాగ్, బాలయ్య, చిరు లాంటి వాళ్లకు హీరోయిన్లు దొరకడం ప్రాబ్లెంగా మారింది. కేవలం అనుష్క, నయనతార, అంజలి లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే హీరోయిన్లుగా దొరుకుతున్నారు. వీళ్లలో కూడా కావాల్సిన వాళ్ల డేట్స్ అడ్జెస్ట్ మెంట్ సమస్యగా మారింది. రీసెంట్ గా బాలయ్యకు ఈ ప్రాబ్లెమ్ ఎదురైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన వందో సినిమాకు నయనతారను తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ లేక తప్పుకుంది. ఆ తర్వాత అంజలి, కాజల్ డేట్స్ కూడా అడ్జెస్ట్ కాలేదట. ఫేడవుట్ స్టేజ్ లో ఉన్న గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగులో క్రేజ్ ఉంది, మళ్లీ అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని సంప్రదిస్తే, ఆ భామ కూడా సినిమాకు నో చెప్పిందంటూ టాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. సీనియర్ హీరో తో చేస్తే అవకాశాలు తగ్గిపోతాయని ఇలియానా భయపడుతోందట. కెరీర్ మంచి ఊపులో ఉన్న వాళ్లు భయపడితే అర్ధముంది కానీ, నిండామునిగిన తర్వాత చలేస్తుందని భయపడితే అర్ధం లేదమ్మా ఇలియానా అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు సినీజనాలు. ఇంతకీ వందో సినిమాలో చేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో మరి..!