English | Telugu

బాలకృష్ణ vs కార్తీ.. గెలుపు ఎవరిది!

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద సినిమాల మధ్య పోటీ అనేది అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలగచేస్తుంది. మూవీ లవర్స్ అయితే మాత్రం ఎన్ని చిత్రాలు వచ్చినా కంటెంట్ నచ్చితే సూపర్ హిట్ చేయడం ఆనవాయితీ. కాకపోతే పోటీ అనేది మాత్రం కలెక్షన్స్ పరంగా ట్రేడ్ సర్కిల్స్ పై ప్రభావం చూపిస్తుంది.

డిసెంబర్ 5 న నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అఖండ 2(AKhanda 2)తో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రం ద్వారా సెల్యులాయిడ్ పై బాలయ్య తాండవం చేయనున్నాడని, మరోసారి కెరీర్ లో బిగ్ హిట్ ని అందుకోబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది.అభిమానులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రంకి పోటీగా కార్తీ అప్ కమింగ్ మూవీ 'వా వాతియార్' డిసెంబర్ 5 నే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ డేట్ ని అధికారంగా ప్రకటించారు. కార్తీకి సుదీర్ఘ కాలం నుండి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంత ఆదరణ అయితే ఉందో, తెలుగులోను అంతే ఆదరణ ఉంది. విజయం సాధించిన చిత్రాల శాతం కూడా ఎక్కువే. అగ్ర నిర్మాణ సంస్థ 'స్టూడియోగ్రీన్' నిర్మిస్తుంది. ఈ సంస్థ గతంలో తెలుగులో ఎన్నో చిత్రాలని నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 , వా వాతియార్ మధ్య పోటీ ఉంటుందని సినీ ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.

వా వాతియార్(Vaa Vaathiyaar)పక్కా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతుండగా, కార్తీ(Karthi)పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి అఖండ 2 , వా వాతియార్ భిన్నమైన జోనర్స్. మరి రెండు చిత్రాలని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పోటీ అనేది పాన్ ఇండియా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలుగచేస్తుంది. అఖండ 2 తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.