English | Telugu
బాలయ్య లెటర్ పై యన్ టి ఆర్ అసంతృప్తి
Updated : Apr 10, 2011
బాలయ్య లెటర్ పై యన్ టి ఆర్ అసంతృప్తిగా ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ఈ మధ్య యువరత్న నందమూరి బాలకృష్ణ పార్టీ వ్యవహారాలతో ప్రస్తుతం తనకేమీ సంబంధం లేదని మీడియాకు ఒక లేటర్ విడుదల చేశారు. విజయవాడ నగర అధ్యక్షులు వల్లభనేని వంశీ మోహన్ కీ, దేవినేని ఉమకూ మధ్య జరుగుతున్న గొడవల గురించి బాలకృష్ణ ఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో తమను ప్రచారానికి పిలిచిన బాబాయ్ ఇప్పుడిలా "నాకేం సంబంధం లేదని తప్పుకోవటం బాధ కలిగించిందని" యన్ టి ఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. యన్ టి ఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా ఈ విషయంపై కాస్త కోపంగానే ఉన్నట్లు సమాచారం.
అసలీ గొడవంతా తెలుగుదేశం పార్టీ పగ్గాలను భవిష్యత్తులో తన ఏకైక కుమారరత్నం నారా లోకేష్ కి అప్పగించే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనీ, దానికి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు గారి నందమూరి వారసులకు మాత్రమే తెలుగు దేశం పార్టీ పగ్గాలు దక్కాలని తెలుగు దేశం పార్టీలో ఒక వర్గం తెగించటం వల్లే ఈ ఘరషణ తలెత్తిందనీ అనుకుంటున్నారు. వంశీ మోహన్, కొడాలి నాని నందమూరి కుటుంబానికి విధేయులు. నందమూరి కుటుంబానికి అవమానం జరగటం వల్లే తాము ఇలా రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. ఇదిలా ఆగితే ఫరవాలేదు.చిలికి చిలికి గాలివానగా మారితే తెలుగు దేశం ముక్కలు చెక్కలవటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.