English | Telugu

బాలయ్య పాట.. అల్లు అర్జున్ ఆట..!!

మెగా ఫ్యాన్స్ కు, నందమూరి అభిమానులకు ఈ రోజు పండగేనని చెప్పాలి. మెగా వారి ఆట, నందమూరి వారి పాట ఓకే రోజు రావడం సినీ అభిమానులకు పెద్ద సెలబ్రేషనే. అల్లు అర్జున్ నటించిన సన్ సత్యమూర్తి సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో మెగా అభిమానులు సత్యమూర్తి కోసం సినిమా ధియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఇదిలావుంటే మరోవైపు నందమూరి అభిమానులను సంబరాలకు రెడీ అవుతున్నారు. బాలయ్య ఎమ్మెల్యే అయిన తరువాత చేస్తున్న మొదటి సినిమా 'లయన్' ఆడియో ఈ రోజు విడుదలకాబోతుంది.

లెజెండ్ వంటి బ్లాక్ బాస్టర్ తరువాత బాలయ్య చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కు శిల్పకళా వేదిక ముస్తాభైంది. ఇప్పటికే బాలయ్య మీద ప్రేమతో అభిమానులు శిల్పకళా వేదిక వద్ద 45 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఓ హీరో కోసం ఇంత పెద్ద కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇప్పటికే నందమూరి అభిమానులు తన పాస్ లతో శిల్పకళా వేదిక వద్ద బారులు తీరారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా రావడం విశేషంగా కనిపిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.