English | Telugu

ప్ర‌భాస్.. ఇండియ‌న్ న‌యా సూప‌ర్ స్టార్ అయిపోయాడా?



ఒక్క సినిమా వెయ్యి మెట్లెక్కించ‌డం అంటే ఏంటో బాహుబ‌లిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. బాహుబ‌లికి ముందు, ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ ఏంటి? అని ఆలోచించుకొంటే అర్థ‌మ‌వుతుంది. ఈ ఒక్క సినిమా ప్ర‌భాస్‌ని దేశ‌మంతా పాపుల‌ర్ చేసింది. ఇది వ‌ర‌కు ప్ర‌భాస్ అంటే.. టాలీవుడ్‌కి మ‌హా అయితే కోలీవుడ్‌కి మాత్ర‌మే తెలుసు. బాహుబ‌లితో ప్ర‌భాస్ బాలీవుడ్‌కీ ఘ‌నంగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. బాహుబ‌లి సృష్టిస్తున్న రికార్డుల గురించీ, రాజ‌మౌళి గురించి బాలీవుడ్‌లో ఎంత ఘ‌నంగా మాట్లాడుకొంటున్నారో, ప్ర‌భాస్ గురించీ అంతే ఇదిగా చ‌ర్చించుకొంటున్నారు. ఓ టాలీవుడ్ హీరో ధీర‌త్వాన్నీ, వీర‌త్వాన్నీ అక్క‌డ పొగుడుతున్నారు.

అవును మ‌రి.. తొలి రోజు రూ. 73 కోట్లు తెచ్చి పెట్టిన హీరో అంటే క్రేజ్ ఉండ‌దా??? త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. బాహుబ‌లి ద్వారా ప్ర‌భాస్ ఆ ఘ‌న‌త సాధించాడు. ద‌క్షిణాదికి చెందిన ఓ క‌థానాయ‌కుడు ఉత్త‌రాదిన జెండా ఎగ‌రేయ‌డం చాలా అరుదైన సంగ‌తే. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, విక్ర‌మ్...ఇలా చాలామంది అలాంటి ప్ర‌యత్నాలు చేశారు.కానీ.. ఎవ్వ‌రికీ ఇలాంటి ఘ‌న‌త మాత్రం సాధ్యం కాలేదు. బాలీవుడ్‌లో భారీగా రిలీజై... తొలి రోజు నుంచీ వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది.. బాహుబ‌లి. తొలి రోజు రూ.5.5 కోట్లు రాబ‌ట్టిన బాహుబ‌లి.. రెండో రోజు 7 కోట్లు సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మూడో రోజు క‌లెక్ష‌న్లు మ‌రింత‌గా పెరిగాయి. దాంతో.. బాలీవుడ్ అంతా ఇప్పుడు ప్ర‌భాస్ గురించి ఆరా తీయ‌డం మొద‌లెట్టింది. అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, షారుఖ్ ఖాన్ సృష్టించిన రికార్డుల్ని చెద‌లు ప‌ట్టిస్తున్న మొన‌గాడు... ప్ర‌భాస్ అని స‌గ‌ర్వంగా కితాబులు ఇచ్చేసింది. దాంతో ప్ర‌భాస్ ఇండియ‌న్ బాక్సాఫీసుకి న‌యా సూప‌ర్ స్టార్‌గా అవ‌త‌రించిన‌ట్టైంది. ప్ర‌భాస్ గురించీ, బాహుబ‌లి గురించీ, రాజమౌళి టేకింగ్ గురించీ.. బాలీవుడ్ మీడియాలో వ‌రుస‌గా క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. అక్క‌డి స‌మీక్ష‌లు కూడా బాహుబ‌లికి అగ్ర‌తాంబూల‌మిచ్చాయి.

ఓ అనువాద చిత్రంగా కాకుండా స్ట్ర‌యిట్ సినిమాగానే బాహుబ‌లిని గుర్తించాయి. మ‌న తెలుగు సినిమాకి ఇంత‌కంటే ఘ‌న‌మైన కీర్తి మ‌రోటి ఉంటుందా..? అందుకే ప్ర‌భాస్ అభిమానులు ఇప్పుడు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు. జ‌య‌హో బాహుబ‌లి అంటూ మ‌రోసారి నిన‌దిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.