English | Telugu

బాహుబ‌లిని కాపీ కొడుతున్న - శ్రీ‌మంతుడు?

తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రం బాహుబ‌లి. తొలి రోజే రూ.73 కోట్ల‌కు పైచిలుకు గ్రాస్ సాధించి ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో వ‌సూళ్ల సునామీ సృష్టించ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సంచ‌ల‌నానికి ఈ సినిమాకొచ్చిన హైప్ ఓ కార‌ణ‌మైతే.. చిత్ర‌బృందం ఫాలో అయిన మార్కెట్ స్ట్రాట‌జీ మ‌రో కార‌ణం. ప‌బ్లిసిటీ విష‌యంలో బాహుబ‌లి టీమ్ కొత్త పంథా అనుస‌రించింది. ఒక్క పైసా కూడా ఖ‌ర్చుపెట్ట‌కుండా కోట్ల రూపాయ‌ల విలువైన ప‌బ్లిసిటీ చేసింది. ఈ ప్లాన్‌... ఇప్పుడు శ్రీ‌మంతుడు టీమ్‌కీ న‌చ్చింది. వాళ్లు కూడా సేమ్ ఇదే మార్కెట్ స్ట్రాట‌జీతో త‌మ సినిమాకి ఫ్రీ ప‌బ్లిసిటీ చేయించుకోవాల‌ని చూస్తోంది. సినిమా విడుద‌ల‌య్యేలోగా వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా.. శ్రీ‌మంతుడు పోస్ట‌ర్ల‌ను ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తూ.. ఈ సినిమాని ప‌బ్లిసిటీ చేద్దామ‌నుకొంటోంది టీమ్.

బాహుబ‌లి ఈ రేంజులో వ‌సూళ్లు సాధించ‌డానికి కార‌ణం.. అత్య‌ధిక థియేట‌ర్ల‌లో సినిమాని విడుద‌ల చేయ‌డ‌మే. ఏ థియేట‌ర్‌కి వెళ్లినా.. అక్క‌డ బాహుబ‌లి పోస్ట‌రే క‌నిపిస్తోంది. ఆసినిమానే ఆడుతోంది. అందుకే.. శ్రీ‌మంతుడు టీమ్ కూడా ఇదే ఫార్ములా అనుస‌రించాల‌ని చూస్తోంది. ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్ర్రాల్లో దాదాపుగా 1800 థియేట‌ర్లున్నాయి. అందులో 1600 థియేట‌ర్ల‌లో శ్రీ‌మంతుడుని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణయించుకొంది. విడుద‌ల‌కు ఒక్క‌రోజు ముందు.. ప్రీమియ‌ర్ షోల‌ను భారీ ఎత్తున ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తోంది.
ప్రీమియ‌ర్ షోల రూపంలో క‌నీసం రూ.4 నుంచి 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వెన‌కేయాల‌ని చూస్తోంది. శ్రీ‌మంతుడు ఒక్క‌టే కాదు... ఇక నుంచి పెద్ద సినిమాల‌న్నీ ఈ ప్రీమియ‌ర్ షోల‌పై దృష్టి పెట్ట‌డం ఖాయం. మొత్తానికి రాబోయే పెద్ద సినిమాల‌కు బాహుబ‌లి ఓ పాఠంలా, దిక్చూచీలా మిగిలిపోయింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.