English | Telugu
అవతార్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్..!
Updated : Jun 14, 2023
అవతార్ లవర్స్‌కి ఇది బ్యాడ్ న్యూసే. ఫస్ట్ టూ పార్ట్స్‌తో ఫిదా అయిన ఆడియన్స్ థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ థర్డ్ పార్ట్ డిలే కానుంది. జేమ్స్ కేమరాన్ హైలీ సెలబ్రేటెడ్ మూవీ అవతార్. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిలే అవుతుందని అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అది కూడా ఏడాది పాటు. అవతార్ పేరు చెప్పగానే ఎక్సలెంట్ మేకింగ్, జైగాంటిక్ బాక్సాఫీస్ కలెక్షన్లు కళ్ల ముందు మెదులుతాయి. జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్ ఇది. అవతార్‌ని తెరకెక్కించిన డిస్నీ సంస్థ అప్‌కమింగ్ మూవీస్ రిలీజ్ డేట్ల విషయంలో మేజర్ షఫ్లింగ్స్ చేస్తోంది. అవతార్3ని 2025 డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు.
ఈ డిలే వల్ల ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా మరింత డిలే అవుతుంది. 2029 డిసెంబర్ 21న విడుదల కానుంది. అవతార్ 5ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వాయిదాలన్నిటనీ బట్టి చూస్తే, ఫస్ట్ అవతార్ రిలీజ్ అయిన 22 ఏళ్ల తర్వాత ఫైనల్ అవతార్ వచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్‌లో జరుగుతున్న స్ట్రైక్, ప్రొడక్షన్ డిలేల కారణంగానే ఈ వాయిదాల పర్వం జరిగినట్టు అర్థమవుతోంది. గత రెండు సినిమాలతో పోలిస్తే, నెక్స్ట్ సినిమాలు ఇంకో రేంజ్‌లో ఉండాలంటే, తప్పకుండా పోస్ట్ ప్రొడక్షన్ మీద కాన్‌సెన్‌ట్రేషన్ చేయాల్సి ఉంది. విజువల్ ఎఫెక్స్ట్ డిపార్ట్ మెంట్ కూడా ఫోకస్డ్ గా పనిచేయాలి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఏడాది పాటు సినిమాను వాయిదా వేశారు. ఆడియన్స్ ని పాండోరాకు కనెక్ట్ చేయడానికి, నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి మేకర్స్ నిర్విరామంగా కష్టపడుతున్నారన్నది ప్రొడక్షన్ హౌస్ నుంచి వినిపిస్తున్న మాట.