Read more!

English | Telugu

' లేడీస్ టైలర్ ' ప్రదీప్ శక్తి కన్నుమూత

హాస్యనటుడిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ శక్తి కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆయన, శనివారం అక్కడే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ శక్తి పూర్తి పేరు వాసిరెడ్డి ప్రదీప్ శక్తి. ఆయనది గుంటూర్. వంశీ లేడీస్ టైలర్ సినిమాతో, ప్రదీప్ శక్తి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కూడా ఎక్కువగా వంశీ సినిమాల్లో ఆయన కనిపించారు. కలియుగ విశ్వామిత్ర అనే సినిమాకు ఆయన దర్శకత్వం కూడా చేశారు. 90ల్లో అమెరికా వెళ్లిపోయిన ప్రదీప్, అక్కడే బాబా హాట్ పేరుతో హోటల్ పెట్టి స్థిరపడ్డారు. చివరిగా ఆయన నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా ఆయన హోటల్ ఓనర్ గానే నటించారు. ఆయన మృతికి చిత్రపరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.