English | Telugu

ఆర్య బుట్ట‌లో ప‌డిపోయిన అనుష్క‌

ఆర్య‌- అనుష్క మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ జ‌రుగుతోంద‌న్న విష‌యం కోలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇద్ద‌రూ క‌ల‌సి వ‌ర్ణ చిత్రంలో జంట‌గా న‌టించారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం పెరిగింద‌ట‌. ఇప్పుడు సైజ్ జీరో అనే సినిమా కోసం మ‌ళ్లీ జ‌త క‌ట్టారు. ఈసారి మాత్రం ఇద్ద‌రూ క్లోజ్ నెస్‌లో పీక్స్‌కి వెళ్లిపోయార‌ని తెలుస్తోంది.

ఆర్య సెట్లో ఉంటే.. త‌న సీన్ లేక‌పోయినా అనుష్క వ‌చ్చేస్తోంద‌ని - ఇద్ద‌రూ షాట్ గ్యాప్ లో క‌బుర్ల‌లో మునిగిపోతున్నార‌ని - సెట్లో వీళ్లిద్ద‌రి గురించే అంద‌రూ మాట్లాడుకొంటున్నార‌ని టాలీవుడ్ స‌మాచారం. అన్న‌ట్టు అనుష్క త‌న ప‌దేళ్ల కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా లిప్ లాక్ సీన్లో క‌నిపించ‌లేదు. అయితే సైజ్ జీరోలో మాత్రం అనుష్క ఆర్య‌కు లిప్ లాక్ ఇచ్చేసింద‌ట‌. ఈ సీన్ ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారంతా.

అంతేకాదు. ఆర్య‌, అనుష్క మ‌ధ్య తెరకెక్కించిన రొమాంటిక్ సీన్స్‌.. బాగా పండాయ‌ని, ఇదంతా వాళ్ల మ‌ధ్య ఉన్న రియ‌ల్ కెమిస్ట్రీనే కార‌ణ‌మ‌ని చెబుతున్నారంతా. ఈ విష‌యం అనుష్క ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే త‌ను మాత్రం లైట్ తీసుకొంది. ఇద్ద‌రం క‌ల‌సి ఓ సినిమా చేస్తున్న‌ప్పుడు ఆ మాత్రం క్లోజ్‌గా మూవ్ అవ్వ‌డం కామ‌న్ అని చెబుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.