English | Telugu
డూప్లికేట్ రాజమౌళి గురించి చెప్పిన అనురాగ్ కశ్యప్
Updated : Mar 27, 2025
భారతీయ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నుంచి రచయితగా,దర్శకుడుగా,నిర్మాతగా,నటుడుగా తన సత్తా చాటుతు వస్తున్న బాలీవుడ్ లెజండ్రీ పర్సన్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). పాంచ్,బ్లాక్ ఫ్రైడే,స్మోకింగ్,రిటర్న్ఆఫ్ హనుమాన్,ముంబై కటింగ్,ఘోస్ట్ స్టోరీస్,కెన్నెడీ,చోక్డ్,లస్ట్ స్టోరీస్ ఇలా ఇప్పటి వరకు సుమారు ఇరవై విభిన్నమైన చిత్రాలు అనురాగ్ దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.నిర్మాతగాను ఉత్తమమైన చిత్రాలని నిర్మించిన అనురాగ్ గత ఏడాది విజయసేతుపతి(VIjay Sethupati)హీరోగా తెరకెక్కిన 'మహారాజ'లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకున్నాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు విద్యార్థులని పుస్తకాలు చదవనివ్వడంతో పాటు సినిమాలు చూడనివ్వండి.వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది ఉదాహరణకి మనకి దర్శకుడు రాజమౌళి ఉన్నారు.ఆయన్ని చూసీ పది మంది డూప్లికేట్ రాజమౌళిలు పుట్టుకొచ్చారు.ఆయన్ని కాపీ కొట్టాలని ప్రయత్నిస్తుంటారు.కానీ ఆయన ఐడియాలు మాత్రమే ఒరిజినల్.కేజీఎఫ్ వచ్చి సక్సెస్ అయ్యింది.అందరు దానినే ట్రెండ్ గా తీసుకొని సినిమాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం.ప్రతిబంద్,శివ ఈ విధంగా చెప్పుకుంటు పోతే నా చిన్నతనం నుంచే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా పేరు చెప్పి సరైన కథల్ని తెరకెక్కించడం లేదని చెప్పుకొచ్చాడు.