Read more!

English | Telugu

ఆనంద్ రవికి దిల్ రాజు చిత్రం

"ఆనంద్" రవికి దిల్ రాజు చిత్రం ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. "ఆనంద్" రవి అంటే శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన యువకుడు రవి. శేఖర్ కమ్ముల వద్ద "ఆనంద్" రవి "హ్యాపీడేస్", "గోదావరి", "లీడర్" వంటి చిత్రాలకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. రవికి మొదటి నుంచీ దర్శకత్వ శాఖ మీద చాలా పట్టుండేది. రవికి దర్శకత్వంలో ఉన్న కమాండ్ గమనించిన ప్రముఖ యువ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో రవి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తానని "ఆనంద్" రవికి మాట ఇచ్చినట్లు సమాచారం.

 

ప్రస్తుతం తానే దర్శకుడిగా మారి "పేరెంట్స్" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. "పేరెంట్స్" చిత్రం రవికి దర్శకుడిగా తొలి చిత్రం కావటం విశేషం. కొత్త దర్శకుల ప్రతిభను గుర్తించటంలో నిర్మాత దిల్ రాజు అందె వేసిన చెయ్యనే సంగతి అమదరికీ తెలిసిందే. అలాంటి దిల్ రాజు వంటి నిర్మాత బ్యానర్ లోసినిమా చేసే అదృష్టం వరించటంతో "ఆనంద్" రవిని అభినందించాలి. ఈ విషయం ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.