English | Telugu
అల్లుఅర్జున్,అమితాబ్ బచ్చన్ ఒక్కటేనా..పుష్ప 2 చూడకపోతే చూడండి
Updated : Dec 27, 2024
భారతీయ సినీ ప్రపంచంలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.1970 లో మొదలైన ఆయన సినీప్రస్థానం నేటికీ కొనసాగుతు ఉందంటే అమితాబ్ కట్ అవుట్ కి ఉన్న స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎంతో మంది హీరోలకి ఇన్సిపిరేషన్ గా కూడా నిలిచాడు. ఈ విషయాన్నే ఆయా హీరోలు చాలా ఇంటర్వూస్ లో చెప్పారు.రీసెంట్ గా కల్కి 2898 ad,వేట్టయ్యన్ లో నటించి తన సత్తా చాటాడు.
ప్రస్తుతం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రోగ్రాం సీజన్ 16 టెలికాస్ట్ అవుతుంది.అందులో కోల్ కతా కి సంబంధించిన ఒక గృహిణి కంటెస్ట్ గా వచ్చింది.అందులో ఆమె అమితాబ్ తో మాట్లాడుతు నాకు అల్లు అర్జున్ అన్నా, మీరన్నా చాలా ఇష్టం.నటనకి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మ్యానరిజమ్స్ ఒకేలా ఉంటాయి.ఈ షో వల్ల మిమ్మల్ని కలిసాను.ఏదో ఒక రోజు అల్లు అర్జున్(allu arjun)ని కలిస్తే నా కల నెరవేరుతుందని చెప్పుకొచ్చింది.ఆమె మాటలకి అమితాబ్ స్పందిస్తు నేను కూడా అల్లు అర్జున్ కి వీరాభిమానిని. అతను చాలా గొప్ప ప్రతిభావంతుడు మాత్రమే కాకుండా తనకి వచ్చిన గుర్తింపులన్నిటికి అర్హుడని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత సరదాగా అల్లు అర్జున్ తో నన్ను పోల్చవద్దంటు కూడా చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా పుష్ప 2 మూవీ ఎవరైనా మిస్ అయితే వెంటనే చూడండి అని ప్రేక్షకులకి చెప్పడం జరిగింది.
ఇప్పుడు అమితాబ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అల్లుఅర్జున్ అభిమానులైతే ఆ మాటలకి ఫుల్ ఖుషి అవుతున్నారు.అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్ళినప్పుడు అమితాబ్ గారి స్ఫూర్తితోనే సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే.