English | Telugu
అల్లు అర్జున్ కి రిమాండ్?
Updated : Dec 13, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలయ్యిన విషయం తెలిసిందే.ఇక ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటికే థియేటర్ ఓనర్, మేనేజర్,అల్లు అర్జున్ కి చెందిన బౌన్సర్లని అరెస్ట్ కూడా చేసారు.
ఇక ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్(allu arjun)ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడిపల్లిలోని పీఎస్ కి తీసుకువెళ్లడం జరిగింది.ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదయిన దృష్ట్యా అల్లు అర్జున్ ని ఇప్పుడు రిమాండ్ ని తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే నోటీసులు ఇవ్వాలనుకున్నా కూడా పోలీసులు ఇంటి దగ్గరే ఇచ్చే వాళ్ళు. అలాంటిది ఇంటికి వచ్చి డైరెక్ట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే రిమాండ్ ని పంపుతారని,అందుకు సంబంధించిన లీగల్ ప్రొసిడింగ్ ని కూడా ప్రారంభించే పనిలో పోలీసులు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.