English | Telugu
రంగంలోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి..వాళ్ల సలహా తీసుకునే అవకాశం
Updated : Dec 13, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలయ్యిన విషయం తెలిసిందే.ఇక ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటికే థియేటర్ ఓనర్, మేనేజర్,అల్లుఅర్జున్ కి చెందిన బౌన్సర్లని అరెస్ట్ చేయగా రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది.పైగా రిమాండ్ కి కూడా తరలించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఆర్ టి సి క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్న చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండటంతో ఆయన్ని కలవడానికి అల్లు అర్జున్ మావ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(kancharla chandrasekhar reddy)రావడం జరిగింది.తొలుత స్టేషన్ లోపలకి చంద్రశేఖర్ రెడ్డి ని పోలీసులు అనుమతించలేదు.కానీ ఆ తర్వాత అనుమతించడం జరిగింది.ఇక ఈ కేసులో ఆయన కూడా న్యాయశాఖ సలహాలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.హైదరాబాద్ లో పలు రకాల విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.