English | Telugu
అల్లు అర్హ న్యూ టాలెంట్.. వీడియో వైరల్
Updated : Sep 17, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం తీరిక దొరికినా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయనతో పాటు ఆయన సతీమణి వారి సంబంధిత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా అర్హకు సంబంధించిన కొత్త టాలెంట్ బయటపడింది. ఇంతకీ ఏంటా టాలెంట్ అనే వివరాల్లోకి వెళితే, వినాయక చవితి సందర్భంగా అర్హ స్కూల్లో వినాయకుడి మట్టి బొమ్మను తయారు చేసే పోటీని నిర్వహించారు. అందులో భాగంగానే వినాయకుడి బొమ్మను అర్హ తయారు చేసింది.
అల్లు అర్హ, వినాయకుడి బొమ్మను తయారు చేయటాన్ని వీడియోగా చిత్రీకరించిన స్నేహ సదరు వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతుంది. టాలెంట్ ఆమె బ్లడ్‌లోనే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ ఓపినియన్స్‌ను వ్యక్తం చేస్తున్నారు. బుజ్జి బుజ్జి మాటలు, చేష్టలతో అల్లు అర్హ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన వీడియోలను బన్ని తన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.
అల్లు అర్హ బాల నటిగానూ సినీ రంగ ప్రవేశం చేసింది. సమంత, దేవ్ మోహన్‌లతో గుణ శేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో చిన్ననాటి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక బన్ని విషయానికి వస్తే తను పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.