Read more!

English | Telugu

బెస్ట్ లవ్ కపుల్ ఆఫ్ టాలీవుడ్

వాలంటైన్స్ డే కు కౌంట్ డౌన్ తో రోజుకో సెలబ్రిటీ కపుల్ సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీని మీకందిస్తున్నాం. నిన్న అమితాబ్ జయబాధురి ప్రేమకథను చూశాం కదా.. మరి ఈరోజు కపుల్ ఎవరో చూద్దామా..

అక్కినేని నాగార్జునకు టాలీవుడ్ మన్మథుడు అని ముద్దుపేరుంది. మరి అలాంటి మన్మథుడితో జీవితాన్ని పంచుకోవడానికి ఎంత అదృష్టం ఉండాలి. నాగార్జునను ఇష్టపడే ప్రతీ అమ్మాయి, అమలను చూసి ఇలాగే కుళ్లుకునేవారేమో..టాలీవుడ్ లో బెస్ట్ లవ్ లీయస్ట్ కపుల్ ఎవరు అంటే, వెంటనే నోటికి స్ఫురించే పేర్లు నాగార్జున, అమల. ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, గౌరవం. దీన్ని పబ్లిగ్గానే చాలాసార్లు ప్రకటించుకున్నారు కూడా. అసలు వీళ్లిద్దరి ప్రేమకథ ఎలా స్టార్ట్ అయింది..?

 


నాగార్జున అమల కలిసి నటించిన తొలి చిత్రం ' శివ '. ఆ సినిమా నాగ్ కు ప్రొఫెషనల్ గా ఎంత ప్రత్యేకమో, పర్సనల్ గా కూడా అంతే ఇష్టం. ఎందుకంటే ఆ షూటింగ్ లోనే అమలను మొట్టమొదట చూశారు. కానీ అప్పటికి అది కేవలం అట్రాక్షన్ గానే ఉంది. తర్వాత ఇద్దరూ కలిసి ' నిర్ణయం ' సినిమా చేసే సమయానికి అట్రాక్షన్ ప్రేమగా రూపుదిద్దుకుంది. అమల అందానికి తోడు, ఆమె సింప్లిసిటీ, కేర్ నాగార్జునను ఫ్లాట్ చేసేశాయి. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయకపోతే, అమలను కోల్పోతానేమో అని భావించిన నాగ్, సినిమా పూర్తయిన తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశారు. అప్పటికే నాగార్జున మీద తనకు కూడా ప్రేమ చిగురించడంతో, మరో మాట లేకుండా ఆయన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశారు అమల. అలా జూన్ 11,1992 న ఇద్దరూ ఒక ఇంటి వారయ్యారు.



పెళ్లైన తర్వాత నాగార్జున అమలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారిద్దరి ప్రేమ ఎలాంటిదంటే, పక్కా బిజినెస్ మ్యాన్ అయిన నాగార్జున, తనకు ఎలాంటి లాభం ఉండదని తెలిసి కూడా అమల స్థాపించిన బ్లూ క్రాస్ కోసం డబ్బు ఖర్చుపెడతారు. తన భార్య కోసమే, ఆయన బ్లూక్రాస్ కు ఫండింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే బ్లూ క్రాస్, హైదరాబాద్ లోని కొన్ని వందల మూగజీవాలకు రక్షణ కల్సిస్తుండటం విశేషం. సినిమాలు మానేసే విషయంలో కూడా నాగార్జున అమలకు ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడ ఇష్టానికే నిర్ణయాన్ని వదిలేశారు. పూర్తిగా తన ఇష్టప్రకారమే, కుటుంబానికి సమయం కేటాయించడం కోసం అమల సినిమాల్ని వదిలేసుకున్నారు.

నాగార్జున అఫైర్స్ గురించి అమల ఒపీనియన్..?
నాగార్జునకు టబుకు ఎఫైర్ ఉందనేది ఎప్పటినుంచో మీడియా చెప్పే వార్త. ఒక టీవీ షోలో, అమలను ఈ విషయమై అడిగితే, తనకు నాగార్జున మీద పూర్తి నమ్మకముందని, అందుకే ఈ విషయాన్ని గురించి తానెప్పుడూ కనీసం ఆలోచించను కూడా లేదని చెప్పారు అమల. ఇది ఒక్కటి చాలు వాళ్లిద్దరి ప్రేమ ఎంతటి నమ్మకాన్ని పునాదిగా చేసుకుని నిలబడిందో.నాగార్జున గురించి ఎన్ని పుకార్లు వచ్చినా, తనకు ఆయనంటే ఏంటో తెలుసని చెప్పే అమలను ప్రతీ భార్య ఆదర్శంగా తీసుకోవాలేమో..
 


వీళ్లదే కాదు..సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీస్ ఎన్నింటిని చూసినా, అక్కడ కనబడే కామన్ పాయింట్ ఒకటే. పరస్పర నమ్మకం, గౌరవం. మనల్ని ప్రేమిస్తున్నారు, ఎక్కడికి పోతారులే, పట్టించుకోకపోయినా ఫర్లేదు అనే శైలి, ప్రేమ కూలిపోవడానికి మొదటి అడుగు. ప్రేమ, గౌరవం వేరు వేరు కాదు. ఒకదానితో మరొకటి రావాలి. అలా లేని నాడు ఆ ప్రేమకు అర్ధం ఉండదు..