Read more!

English | Telugu

భారీగానే ప్లాన్ చేస్తున్న శంకర్

ఎన్ శంకర్ అనే పేరు సూపర్ హిట్ సినిమాలకు భారీతనానికి పెట్టింది పేరు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూస్తే, ఆయన టేకింగ్ ఎంత భారీ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది. రజనీకాంత్ హీరోగా ఆయన చేస్తున్న రోబో 2 కు హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుని, ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ సినిమాలో విలన్ గా ఆర్నాల్డ్ ను తీసుకుంటారనే వార్తలు వచ్చినా, తర్వాత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను తీసుకున్నారు. తాజాగా హాలీవుడ్ లో ట్రాన్స్ ఫార్మర్స్, డై హార్డ్ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన కెన్నీ బేట్స్ ను, రోబో 2 యాక్షన్ సీక్వెన్స్ ల కోసం తీసుకున్నారు.

మార్చిలో స్టార్ట్ అయ్యే షెడ్యూల్లో అక్షయ్ రజనీ ల మీద యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమా గ్రాఫిక్స్ కు కూడా అవెంజర్స్, ఐరన్ మ్యాన్ సినిమాలకు పనిచేసిన లెగసీ ఎఫెక్ట్స్ కంపెనీ విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. తన ఐ సినిమాలో అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ నే రోబో 2 కు కూడా హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఇంత భారీగా తీస్తున్న రోబో 2 టోటల్ బడ్జెట్ 350 కోట్లని సమాచారం. రజనీ క్రేజ్ తో , ఇండియా వైడ్ తో పాటు, ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉండటం వల్లే, శంకర్ ఇంత భారీగా వెళ్తున్నాడట. బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్ కూడా శంకర్ కు ఎంకరేజ్ మెంట్ లా పనిచేసిందని ఇన్ సైడ్ టాక్.