English | Telugu

బాలయ్య తాండవం.. సాంగ్‌ ప్రోమోలో ఈ హైలైట్స్‌ను గమనించారా?

నందమూరి అభిమానులే కాదు, అందరు హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అఖండ2’. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పెర్‌ఫార్మెన్స్‌ పతాక స్థాయిలో ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్‌ అయిన గ్లింప్స్‌, తాజాగా విడుదలైన టైటిల్‌ సాంగ్‌ ప్రోమో తెలియజేస్తున్నాయి. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే హ్యాట్రిక్స్‌ హిట్స్‌ వచ్చాయి. రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతూ ‘అఖండ2’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

అఖండ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. దాంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే సినిమా ఉండబోతోందనేది అర్థమవుతోంది. ‘అఖండ.. తాండవం..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ ఎంతో అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమాకే హైలైట్‌ అయ్యేలా కనిపిస్తోంది. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని రచించిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, కైలాష్‌ఖేర్‌ పాడారు. అయితే సాంగ్‌ ప్రోమోలో టైటిల్‌ వరకే వినిపించింది.

నవంబర్‌ 14న అఖండ తాండవం లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి తమన్‌ మ్యూజిక్‌ పెద్ద ప్లస్‌ పాయింట్‌ కాబోతోంది. ఈ సాంగ్‌ ప్రోమోలో బాలయ్య గెటప్‌, పెర్‌ఫార్మెన్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అఘోరా అంటే ఇలాగే ఉంటాడు అనిపించేలా ఎంతో గంభీరంగా బాలయ్య లుక్‌ను డిజైన్‌ చేశారు. ఈ పాటలోని విజువల్స్‌, బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌, తమన్‌ మ్యూజిక్‌ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్‌ ప్రోమోకి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.