English | Telugu
akhanda 2: ఇక ఈ డేట్ కి ఫిక్స్ అవ్వండి!
Updated : Dec 9, 2025
-ఈ డేట్ ఫిక్స్
-థియేటర్స్ దగ్గర జాతర స్టార్ట్
-కీలక ప్రకటన రాబోతుంది
అఖండ 2 థియేటర్స్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అభిమానుల పడిగాపులు తప్పడం లేదు. సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నా థియేటర్ యాజమాన్యం కరెక్ట్ డేట్ చెప్తుందనేది వాళ్ళ ఆశ. అందుకే ఏదో ఒక టైంలో అఖండ 2 (Akhanda 2)థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. పైగా థియేటర్స్ కి చేసిన డెకరేషన్ ని కూడా చూసుకుంటూ కరెక్ట్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్.
రీసెంట్ గా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అఖండ 2 ఈ నెల 12 న ల్యాండ్ అవ్వడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ డేట్ చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది. కానీ ఈ డేట్ కి రిలీజ్ కి ఉంటుందా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉంది. కానీ విశ్వనీయ సమాచార వర్గాల ప్రకారం నిర్మాతలు, ఫైనాన్సియర్ల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, దీంతో ఈ రోజు రాబోయే కోర్ట్ తీర్పు అనుకూలంగా రాబోతుందనే అభిప్రాయాన్ని సినీ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిమానుల హంగామా పదకొండవ తారీకు నైట్ నుంచే బెనిఫిట్ షోస్ నుంచే ప్రారంభం కానుంది.
also read:క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పవన్ పై జయసుధ కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీలో చేరుతుందా!
ఇక పన్నెండు రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి ఈ రోజు అధికార ప్రకటన కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే థియేటర్స్ దగ్గర అభిమానుల జాతర ప్రారంభమయినట్లే.