English | Telugu

‘అఖండ 2’ పై ఆ సినిమాల భారం... అందుకే ప్రీమియర్ షోలు క్యాన్సిల్

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణల కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సినిమాపై చిత్ర సీమతో పాటు బాలయ్య అభిమానులలోను, సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లతో పాటు ఒక సాంగ్ అఖండ 2పై భారీ అంచనాలను పెంచేశాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 చిత్రం విడుదల కానుంది.

అన్ని పెద్ద సినిమాల మాదిరిగానే అఖండ 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు, ప్రీమియర్ షోలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. సనాతన ధర్మం, శివతత్వం, అఘోరాల నేపథ్యంతో వస్తున్న అఖండ 2 ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసినట్లు చిత్రం బృందం ప్రకటించింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అఖండ 2 నిర్మించారు. కాగా ‘అఖండ 2’ మూవీ అసలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి అలాగే 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి మునుపటి లావాదేవీలలో కొన్ని అప్పులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 90 కోట్లకు పైగా ఫైనాన్సియర్స్‌కి చెల్లించవలసి ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెండు సంస్థలు ఇదివరకు తీసిన సినిమాల బకాయిలు అధికమై ‘అఖండ 2’పైన ఆ భారం పడ్డట్లు గుసగుసలు. ఈ విషయాలు తేలేవరకు సినిమాను రిలీజ్ కూడా కష్టమే అనుకుంటున్నారు. బాలకృష్ణ బరిలోకి దిగి రాత్రిలోగా విషయాన్ని సధ్దుమణిగేలా చేస్తారని అనుకుంటున్నారు. ఇక ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి బాలయ్య ఫ్యాన్స్‌లో కంగారు నెలకొంది

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.