English | Telugu

అఖండ 2 ఎంత కలెక్షన్స్ ని సాధిస్తుంది! ఫ్యాన్స్ చెప్తున్న లెక్క ఇదే 

-అఖండ 2 పై ఫ్యాన్స్ భారీ ఆశలు
-కలెక్షన్స్ ఎంత!
-పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డులు గ్యారంటీనా!
-ప్రస్తుత అప్ డేట్ ఏంటి

థియేటర్స్ వద్ద గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అభిమానుల జాతరని వీక్షించడానికి ముహూర్తం దగ్గర పడింది. అభిమానులు కూడా అందుకు తగ్గట్టే జాతర ఏ స్థాయిలో చెయ్యాలనే ప్రీ ప్రీపరేషన్స్ లో ఉన్నారు. దీన్నిబట్టి వాళ్ళల్లో అఖండ పార్ట్ 2 పై ఉన్న అంచనాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం వచ్చిన సెకండ్ క్యారక్టర్ మురళీకృష్ణకి సంబంధించిన టీజర్ తో అయితే ఆ అంచనాలు తారాస్థాయిలోకి చేరాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా అఖండ 2 కి సంబంధించిన పలు అంశాల గురించి అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. వాటిల్లో అఖండ 2 సాధించే కలెక్షన్ల అంశం కూడా ఒకటి.

అభిమానులు మాట్లాడుతు 'అఖండ 2(Akhanda 2)తో ఈసారి బాలయ్య పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం డేవోషనల్ సీజన్ నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కడుతున్నారు. ఇటీవల రిలీజైన మిరాయ్, కాంతార చాప్టర్ 1 లే ఉదాహరణ. ముఖ్యంగా చాప్టర్ 1 శివతత్వాన్ని బేస్ చేసుకుని తెరకెక్కింది. అఖండ 2 కూడా కంప్లీట్లీ శివతత్వంతో కూడిన మూవీ. మేకర్స్ కూడా పాన్ ఇండియా ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకొని నిర్మాణ విషయంలో రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. దీంతో కంటెంట్ బాగుంటే బాలయ్య రికార్డుల వేట కొనసాగించడం పెద్ద కష్టమైన పని కాదు. పైగా బోయపాటి,(Boyapati Srinu)బాలయ్య కాంబోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. దీంతో అఖండ 2 తో మా బాలయ్య సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాడనే నమ్మకం వాళ్ళల్లో చాలా బలంగా ఉంది.

Also read: ఇస్రో రాకెట్ కి బాహుబలి పేరు.. ఆకాశంలోకి పంపించాక జరిగింది ఇదే


ఇక అఖండ 2 అప్ డేట్ ని ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా, ముందు రోజు రాత్రి నుంచే శివ తాండవం ప్రారంభం కానుంది. బాలయ్య పద్మభూషణ్ అందుకున్నాక వస్తున్న తొలి మూవీ కావడంతో తాండవం యొక్క స్థాయి కూడా పెరగనుంది. ఆదిపినిశెట్టి ప్రతి నాయకుడు కాగా సంయుక్త మీనన్(Samyutha Menon)హీరోయిన్. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, 14 రీల్స్ నిర్మాతలు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.