Read more!

English | Telugu

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్.. లైట్ తీస్కో!

ప్రగతి.. వెండితెరపై తన నటనతో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న నటి. అయితే ప్రగతికి సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అదే కాక తనొక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో కుకింగ్ వీడీయోలు, హెల్త్ టిప్స్, హెయిర్ ఫాల్ టిప్స్, తన వ్యక్తిగత జీవితంంలోని కొన్ని గుర్తుండిపోయే రోజులని, సెలబ్రేషన్స్ ని అన్నింటిని యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తుంటుంది.

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్.. లైట్ తీస్కో అనే ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది ప్రగతి. "అసలు లైఫ్ నలభై సంవత్సరాల తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ఇరవై ఏళ్ళు చదువుతో పోతుంది. ఇరవై నుండి నలభై ఏళ్ళు వరకు లైఫ్ లో సెటిల్ అవ్వాలి, పిల్లల్ని ఎలా పెంచాలని ఆలోచించడానికే సరిపోతుంది. అయితే నలభై తర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తుంటారు కొందరు. ఒక వర్గం వారు ఇంకా అలానే ఆలోచిస్తున్నారు.. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా టైం వేస్టే. వాళ్ళకింక ఏమీ లేక అలా మాట్లాడుతున్నారని నా ఉద్దేశం అంతే" అని ప్రగతి చెప్పింది. నలభై తర్వాతే అసలు మనకి సిచువేషన్ ని హ్యాండిల్ చేసే పరిణితి వస్తుంది. మనం మన లైఫ్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాం.. కానీ నేర్చుకోలేకపోతాం. అలాంటివి చేయడానికి నలభై తర్వాతే కరెక్ట్  అని ప్రగతి అంది.

నేను జిమ్ లో నాకోసం కష్టపడుతున్నాను. నేను నాకోసం టైం స్పెండ్ చేస్తున్నాను.‌ నేను ఇలా ఉన్నానంటే కారణం నా గురించి నేను ఆలోచించడం.. లైఫ్ లో ఏదీ అంత ఈజీగా రాదు.. ఈజీగా వచ్చేది ఏదంటే కామెంట్ చేయడం. మనకి ఏజ్ తో పాటు ఆలోచించే మెచురిటీని కూడా పెంచుకోవాలి. మనం ఎదుటివారి గురించి నెగెటివ్ గా ఆలోచిస్తే.. మనకి నెగెటివ్ థాట్సే వస్తాయి. ఎప్పుడైతే మన గురించి మనం పాజిటివ్ గా ఆలోచిస్తామో అప్పుడే మనకి పాజిటివ్ కలుగుతుందని ప్రగతి చెప్పుకొచ్చింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. నలభై తర్వాత చాలా చేయొచ్చు.. చాలా నేర్చుకోవచ్చు.. ఎంతో టైం ఉంటుంది. మన గురించి మనకి ఆలోచించేంత టైం దొరుకుతుంది. ఏజ్ ని చాలా‌ గ్రేస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడం ఇంపార్టెంట్.. ఏజ్ ఏజ్ అని ఒక కొండలా బరువు పెట్టుకోకండి.. ఒక క్యాప్ లా పెట్టుకొని హ్యాపీగా ఉండండని ప్రగతి చెప్పుకొచ్చింది. ఇలా తన ఏజ్ నలభై దాటిందని.. దాని గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదని.. మీరు కూడా మీ గురించి ఆలోచించుకోండని సలహా ఇచ్చింది ప్రగతి.