English | Telugu
కరాటే కళ్యాణి,తమన్నాసింహాద్రికి లీగల్ నోటీసులు పంపించిన హేమ
Updated : Apr 6, 2025
సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న నటి హేమ(Hema).1989 లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన హేమ సుమారు 200 సినిమాలకి పైగా నటించింది,పలుతమిళ.కన్నడ,హిందీ భాషల్లోను నటించి తన సత్తా చాటిన హేమ,గతంలో తన పరువుకి భంగం కలిగించేలా ప్రముఖ నటి కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్ట్ తమన్నాసింహాద్రి వ్యాఖ్యానించారని ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపింది.ఈ విషయంపై హేమ మాట్లాడుతు లాస్ట్ టైం నేను ఒక ఇష్యులో ఇరుకున్నప్పుడు కరాటే కళ్యాణి,తమన్నా సింహాద్రి నన్ను బ్లేమ్ చేసారు.పలు మీడియా సంస్థలతో పాటు యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా కూర్చొని నా పరువుకి భంగం కలిగేలా మాట్లాడారు.నాకంటు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది.నేను ఆర్టిస్ట్ అయినంత మాత్రాన,నోరు ఉంది కదా అని నా గురించి మాట్లాడే హక్కు ఎవరకి లేదు.నిజాలు అయినా మాట్లాడకూడదు.అలాంటిది అబద్హాలు ఎలా మాట్లాతారు.సోషల్ మీడియాలో కరాటే కళ్యాణి, సింహాద్రి తమన్నా అని టైపు చెయ్యగానే నా గురించి మాట్లాడిన వీడియోలు వస్తున్నాయి.రేపు నా బిడ్డకి పెళ్లి అవ్వాలి.మనవలు,మనవరాళ్లు వస్తారు.నా గురించి అవాస్తవాలు మాట్లాడిన వీడియోల్ని వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారు.ముందు ముందు నాలా మరెవరికి ఇలాంటివి జరగకుడదనే పరువు నష్టం దావా వేసాను.
ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం తమన్నా సింహాద్రి అడ్రస్ దొరకలేదు.పైగా మా లాయర్ చనిపోయాడు. దాని వాళ్ళ కూడా డిలే అయ్యింది.కోర్టులో నాకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది.