English | Telugu

శ్రీలీలకు చేదు అనుభవం.. పబ్లిక్ లో బలవంతంగా చేయి పట్టుకొని...

పబ్లిక్ ప్లేస్ లలో హీరోయిన్ లు జాగ్రత్తగా ఉండాలి. ఆకతాయిలు వారిని తాకాలని చూడటం, చెయ్యి పట్టుకొని లాగడం వంటివి చేస్తుంటారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా యంగ్ బ్యూటీ శ్రీలీలకు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. (Sreeleela)

కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజా షెడ్యూల్ డార్జిలింగ్‌ లో జరిగింది. అక్కడ షూటింగ్ ముగిశాక కార్తిక్‌ ఆర్యన్‌ తో కలిసి శ్రీలీల తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఆ గుంపులో ఉన్న ఆకతాయిలు.. శ్రీలీల చేయి పట్టుకొని బలవంతంగా పక్కకు లాగారు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాకైంది. అది గమనించిన సిబ్బంది, వెంటనే అప్రమత్తమై ఆమెను వారి నుంచి విడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ ఆకతాయిల తీరుపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం