English | Telugu

ఆ డైరెక్టర్ ఒంట‌రిగా ఆఫీసుకు రమ్మన్నాడు!

శుభసంకల్పం, శుభలగ్నం, మావిచిగురు ఇలా ఎన్నో క్లాసికల్ చిత్రాల్లో నటించింది ఆమని. కె విశ్వనాథ్, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ, బాపు వంటి చిత్రాలన్నింటిలో ఈమె నటించింది. ఇలాంటి దిగ్గజద‌ర్శ‌కుల‌తో పనిచేసిన ఆమని పరిశ్రమలో అగ్ర హీరోల సరసన కథానాయకగా నటించి మెప్పించింది. ఓ దశాబ్ద కాలం ఓ వెలుగు వెలిగింది. ఈమె ఇటీవల మరలా కంబ్యాక్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బాగానే అవకాశాలు అందుకుంటుంది.

టీవీ కాన్సెప్ట్ లో ఆమెని బిజీగా చేస్తున్నాయి. ఆమని కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్లో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం నేను ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాను. అక్కడ చాలా రకాల పరిస్థితులు చూశాను. నేను బయటకు ఎక్కడికి వెళ్లినా వెంట మా అమ్మ ఉండేవారు. ఏ సినిమా ఆఫీసుకు వెళ్లిన ఆమె వచ్చేవారు. అలా అమ్మ వెంట రావడం సినీ ఆఫీసుల్లో కొందరికి నచ్చేది కాదు. అమ్మ లేకుండా ఆఫీసుకు ఒంటరిగా రమ్మన్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చేదాన్ని. ఆమె లేకుండా నేను రాను అని ఖ‌రాకండీగా చెప్పేసే దాన్ని.

ఎవరు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి కొంత సమయం పట్టింది. అప్పుడే నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయన మొదటి నుంచి సినిమాలో వైపుకు వెళ్ళద్దని చెప్పేవారు. చెల్లీ పాత్రలో కూతురు పాత్రలు ఆఫర్ చేసేవారు. ఒక సినిమాలో చెల్లెలుగా నటిస్తే అలాగే వ‌రుస‌గా అలాంటి పాత్రలే వస్తాయని తెలుసు. అందువలన హీరోయిన్‌గా కాకుండా వేరే పాత్రలు చేయనని చెప్పేదాన్ని. అలా హీరోయిన్ కావ‌డానికి రెండేళ్ల సమయం పట్టింది అని ఆమని చెప్పుకొచ్చింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.