English | Telugu
ఏఆర్ రెహ్మాన్ ఇంటిపై దాడి
Updated : May 21, 2014
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అమెరికా నివాసంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తుండటంతో అక్కడ కూడా నివాసం ఏర్పరుచుకున్నారు. అమెరికాలో గల లాస్ ఏంజిల్స్ లో ఆయన ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటిపై సోమవారం దాడి జరిగినట్లు తెలుస్తోంది.
రెహ్మాన్ తన సోషల్ మీడియా అకెంట్ ద్వారా తన ఇంటిపై దాడి జరిగిందని తెలియపరిచారు. ఈ వార్తతో ఆయన అభిమానులు చాలా మంది ఆందోళనకు గురై, వెంటనే ఆయన క్షేమ సమాచారం కోరుతూ ప్రశ్నలు గుప్పించారు.
ఈ ఘటనలో కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరుగలేదు. ఈ ఘటన గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, పోలీసులు ఈ విషయమై విచారణ చేస్తున్నారని, అలాగే అమెరికాలో ఇలాంటి దాడులు మామూలే అని రెహ్మాన్ తరపు ప్రతినిధి అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తు తెలిపారు.