English | Telugu

ఓజీ ఆగమనం.. డేంజర్ లో ఆర్ఆర్ఆర్, పుష్ప-2 రికార్డులు!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. అయితే కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక, తన స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా 'ఓజీ' వస్తోంది. (They Call Him OG)

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ 'ఓజీ' అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు

ట్రేడ్ వర్గాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా మూడే మూడు సినిమాలు మొదటి రోజు రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. రూ.74 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా.. రూ.70 కోట్ల షేర్ తో 'పుష్ప-2', రూ.61 కోట్ల షేర్ తో 'దేవర' ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. 'ఓజీ' మూవీ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్'లను దాటుకొని, టాప్ పొజిషన్ కి వెళ్తుందా అనేదే ఇక్కడ ఆసక్తికరం.

'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ప్రస్తుతం 'ఓజీ'పై అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆకలితో ఉన్నారు. పైగా, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అదనపు షోలకు, అదనపు టికెట్ ధరలకు అనుమతి లభించింది. మిడ్ నైట్ షో ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో కూడా టికెట్ హైక్ కి అనుమతి లభించే ఛాన్స్ ఉంది. అసలే భారీ హైప్, పైగా అదనపు టికెట్ ధరలు, దానికితోడు ఇతర భారీ సినిమాల నుంచి పోటీ కూడా లేదు. సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ 'ఓజీ' మయం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ లెక్కన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే షేర్ పరంగా.. పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలను 'ఓజీ' క్రాస్ చేసినా ఆశ్చర్యంలేదు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.