English | Telugu

తెలుగులో 'వార్-2' రికార్డు బిజినెస్.. దటీజ్ ఎన్టీఆర్!

ఒక హిందీ సినిమా తెలుగులో వంద కోట్ల బిజినెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భాగం కావడంతో 'వార్-2' (War 2) ఆ ఫీట్ సాధించేలా ఉంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బిజినెస్ పరంగా, కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వార్-2 బిజినెస్ కి ఫుల్ డిమాండ్ ఉన్నట్లు సమాచారం.

వార్-2 తెలుగు థియేటర్ హక్కులు రూ.100-120 కోట్ల రేంజ్ లో అమ్ముడయ్యే అవకాశముంది అంటున్నారు. ఈ రైట్స్ కోసం పలు తెలుగు నిర్మాణ సంస్థలు పోటీ పడుతుండగా.. సితార, ఏషియన్ సంస్థలు ముందు వరుసలో ఉన్నట్లు వినికిడి.

ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' తెలుగునాట రూ.120 కోట్ల రేంజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.160 కోట్ల షేర్ రాబట్టి లాభాలను తెచ్చిపెట్టింది. అందుకే ఎన్టీఆర్ స్టార్డంని దృష్టిలో పెట్టుకొని వార్-2 రైట్స్ కి డిమాండ్ ఏర్పడినట్లు టాక్. పైగా హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్ కావడంతో జనరల్ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొనే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్ గా తెలుగునాట వార్-2 బిజినెస్ ఎంతకి లాక్ అవుతుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.