English | Telugu

'రౌడీ జనార్దన్‌'గా విజయ్ దేవరకొండ.. మాస్ కమ్ బ్యాక్ లోడింగ్!

'రాజావారు రాణిగారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'రౌడీ జనార్దన్‌' అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్-కీర్తి జోడిగా నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న 'రౌడీ జనార్దన్‌' ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. సినిమాటోగ్రాఫర్ గా అనంద్ సి.చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ గా డినో శంకర్ వ్యవహరిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విజయ్ కొన్నేళ్లుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన గత చిత్రం 'కింగ్డమ్' నిరాశపరిచింది. దీంతో 'రౌడీ జనార్దన్‌'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. దీంతో పాటు, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం