English | Telugu

"తుమ్మెద" మనసు లేని ప్రేమికుల కథ !

భాస్కర మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా నరేష్ అడపా- సరయు చిట్టాల సంయుక్త నిర్మిస్తున్న చిత్రం 'తుమ్మెద''మనసు లేని ప్రేమికుల కథ ' అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో ' ఆనంద్' ఫేమ్ రాజా,విజయ్,వర్ష, అక్షయ ముఖ్య తారాగణం.ఈ చిత్రం ద్వారా పలువురు ప్రముఖ దర్శకులు వద్ద పనిచేసిన కె.నారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒక పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తుమ్మెద' ఆడియో త్వరలోనే విడుదల కానుంది.

ఈ సంధర్భంగా చిత్ర దర్శకులు కె .నారాయణ మాట్లాడుతూ అసభ్యత - అశ్లీలతలకు తావులేని సకుటుంబ సమేతంగా చూసి ఆనందించతగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'తుమ్మెద ' మా హీరో రాజాకు ఆనంద్ ఎంత పేరు తెచ్చిందో తుమ్మెద అంతకు మించి మంచి పేరు తెస్తుంది.మా నిర్మాతలు నరేష్ అడపా - సరయు చిట్టాల ఎంతో ప్యాషన్ తో, ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా వారికి దర్శకుడిగా నాకు చక్కని శుభారంభాన్నిచ్చే చిత్రమిది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.వచ్చే వారంలో మిగిలి ఉన్న పాటను హీరో రాజా - వర్ష లపై చిత్రీకరించి నెలాకరున ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. జీవా, రమణమూర్తి, ధనరాజ్ ,సుమన్ శెట్టి,చంటి ,అన్నపూర్ణమ్మ,డబ్బింగ్ జానకి, పావలా శ్యామల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : సత్య, కెమెరా: మహి, సంగీతం : రాబిన్, సాహిత్యం: వనమాలి, నిర్మాతలు : నరేష్ అడపా-సరయు చిట్టాల, రచన - దర్శకత్వం: కె.నారాయణ

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.