English | Telugu

టాలీవుడ్‌కీ లాంగ్ లీవ్ !!

ఏడేళ్ల క్రితం జరిగిన 75 సంవత్సరాల వేడుక (వజ్రోత్సవం) సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు రెండ్రోజుల సెలవు ప్రకటించారు. కానీ ఈ సారి భారతీయ చిత్ర పరిశ్రమ 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఏకంగా ఏడు రోజులు సెలవు ప్రకటించబోతున్నారు. సెప్టెంబర్ 1,2 మరియు 3 తారీఖుల్లో చెన్నయిలో భారతీయ సినిమా హండ్రెడ్ ఇయర్స్ సౌతిండియన్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులతోపాటు నాలుగు భాషలకు చెందిన అగ్ర తారలంతా హాజరుకానున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిధి. మూడు రోజులపాటు జరిగే వినోద కార్యక్రమాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు టాప్ స్టార్స్ పాల్గొనబోతున్నారు. అందుకే టాలీవుడ్‌కు వారం రోజుల లాంగ్ లీవ్ ప్రకటించారు. మరి ఈ లాంగ్ లీవ్ ఎంతవరకు అమలవుతుందన్నది వేచి చూడాల్సిందే!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.