English | Telugu

మళ్ళీ హిట్ కాంబినేషన్ల ట్రెండ్

ఇంతకుముందు ఓ హీరో_హీరోయిన్ నటించిన సినిమా హిట్టయితే.. వారిద్దరి కాంబినేషన్‌లో ఇమ్మీడియట్‌గా మరో సినిమా ఉండేది. అటువంటి "హిట్ పెయిర్స్" మన ఇండస్ట్రీలో చాలానే ఉండేవి. కానీ.. కాలక్రమంలో హిట్ పెయిర్స్ కనుమరుగైపోయాయి. తమ సరసన ఓ చిత్రంలో సరసాలాడిన సుందరాంగిని.. మరో సినిమాలో తమతో నటింపజేసుకోవడాన్ని మన హీరోలు నామోషీగా ఫీలవ్వడం మొదలైంది. ప్రతి సినిమాలోనూ "కొత్తదనం" కోరుకొనే కథానాయకులు ఎక్కువైపోయారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మళ్లీ మారింది.

హిట్ కాంబినేషన్స్ రిపీటవుతున్నాయి. "ఇష్క్" జంట నితిన్_నిత్యామీనన్ "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంలో నటించి మరో హిట్ సొంతం చేసుకోవడం తెలిసిందే. "సింహా"లో బాలకృష్ణతో జతకట్టిన నయనతార.. "శ్రీరామరాజ్యం"లోనూ నటించింది. అలాగే.. ఇటీవలె "స్వామి రా రా" చిత్రంతో విజయాన్నందుకొన్న నిఖిల్_స్వాతి కాంబినేషన్‌లో తాజాగా "కార్తికేయ" పేరుతో ఓ చిత్రం మొదలైంది. అదే విధంగా.. ఘనవిజయం సాధించిన "మిర్చి"లో ప్రభాస్‌తో నటించిన అనుష్క కూడా మళ్లీ అతనితో "బాహుబలి"లో నటిస్తొంది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.